
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇల్లు : ఎంపిడివో
తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండల పరిధిలో జీవనం సాగిస్తూ ఇల్లు లేని నిరుపేదలు ఇంటి కొరకు దరఖాస్తు చేసుకోవాలని తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.సోమవారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంత ఇల్లు లేని వారు నవంబర్ 30 లోపు గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా సొంత ఇల్లు మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలియజేశారు.2029 సంవత్సరం వరకు ఇదే లిస్టు మంజూరు చేయబడుతుందని,ఇప్పుడు దరఖాస్తు చేసుకోని పక్షంలో నవంబర్ 30 తరువాత 2029 వరకూ మధ్యలో ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవని వారు తెలియజేశారు.ప్రస్తుతము ఒక ఇంటి నిర్మాణం విలువ రూ 1,80,000 గా ప్రభుత్వము మంజూరు చేస్తుందని కావున ప్రజలు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా సొంత ఇల్లు నిర్మించుకొని, ఇప్పటివరకు వ్యక్తిగత మరుగుదొడ్డి లేని కుటుంబాల వారు సంబంధిత పత్రాలను జతచేసి సచివాలయంలో పంచాయతీ డెవలప్మెంట్ అధికారి లేక ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు అందజేసినచొ వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు చేయబడుతుందని,ఇప్పుడు ఖాళీ స్థలమునకు జియో టాగింగ్ చేసి, నిర్మించేటప్పుడు జియో టాగింగ్ చేసి, పూర్తయిన తర్వాత కూడా జియో ట్యాగింగ్ చేసిన తర్వాతే బిల్లు మంజూరు అవుతుందని తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.

