ఎమ్మిగనూరులో అంబేద్కర్ వేడుకలు వందలాదిగా తరలివచ్చిన ప్రజలు
ఎమ్మిగనూరు న్యూస్ వెలుగు : ఎమ్మిగనూరు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు యస్.దేవసహాయం తెలిపారు. సోమవారం స్థానిక మండల తహాశీల్దార్ కార్యాలయ ఆవరణం నందు డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ వేడుకలను వేలాది మందితో ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు టీచర్ ఆరెకంటి భాస్కర్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగించారు. పట్టణంలోని ఎం.బి. చర్చి దగ్గర నుండి సభా స్థలం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్యమండలి నృత్యాలు, అంబేద్కర్ పాటలతో… ఎమ్మిగనూరు దద్దరిల్లిందన్నారు .
రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే నినాదం ప్ల కార్డ్స్ ను ప్రదర్శించారు.అంబేద్కర్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి గజమాలతో పూలమాలంకరణ చేసి ఘన నివాళులర్పించారు. తల సేమియా బాధిత పిల్లల కోసం ఏర్పాటు చేసిన “రక్తదాన శిబిరాన్ని” ప్రారంభించారు. ఎందరో యువకులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు.
సభలో టీచర్ పి.మాదన్న ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ – రాజ్యాంగం అంశంపై వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో.. ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ బుడగ జంగం రుద్రాక్షల పెద్దయ్య, మాల ఉశేని, గంజహళ్లి మహదేవ్ మాదిగ,టీచర్ ఎరుకల కృష్ణ, యస్.రాజు, సోగనూరు ఆనందరావు, కనకవీడు రాజు,
రోజా ఆర్ట్స్ ఉసేని, బుడగ జంగం రుద్రాక్షల దస్తగిరి, కలుగొట్ల మాల రాజా రమేష్, సుమాల అంతోని, గుడికల్ స్వామిదాసు, కలుగొట్ల బుడగ జంగం రామరాజు, ఎరుకల శివ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.