
పిడుగుపాటుకు భార్య భర్తలు మృతి
గోరంట్ల మండలం దిగువ గంగంపల్లిలో పిడుగుపాటు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం..
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ
శ్రీ సత్యసాయి, న్యూస్ వెలుగు; శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాకు చెందిన దాశరథి నాయక్, దేవి భాయ్ భార్య భర్తలు ఇద్దరు ఉదయం పిడుగుపాటుతో చనిపోయారు. అదేవిధంగా వీరికి సంబంధించిన 2 ఆవులు కూడా మృతి చెందాయి. వీరి కుమారుడు జగదీష్ నాయక్ పరిస్థితి విషమంగా ఉండడంతో పుట్టపర్తి లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పిడుగుపాటు మృతి చెందడం బాధాకరం. వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ గారు. ప్రభుత్వం వీరి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సవితమ్మ గారు తెలియచేసారు .అదే విధంగా మృతి చెందిన వ్య క్తులకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలతో పాటు మృతి చెందిన ఆవుల ఒక్కొక్క దానికి 35,000 రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇప్పించి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియచేసారు.