
చిరంజీవి కాంగ్రెస్ లో ఉంటే ముఖ్యమంత్రి అవుతారు : కొత్తూరు సత్యం
న్యూస్ వెలుగు, కర్నూలు; కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఉంటే భవిష్యత్తులో ఆ ముఖ్యమంత్రి అవుతారని కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సేవా దృక్పథంతో ప్రజల్లోకి వచ్చి ప్రజా సేవ చేసి ఆ తర్వాత ప్రజారాజ్యం స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రం మంత్రి అయ్యారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అలాగే కొనసాగే ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని ఆయన తెలిపారు. రాజకీయాలకు దూరంగా సినిమాలకు దగ్గరగా ఇంకోవైపు సేవ చేస్తూ మౌనంగా ఉండటం సరికాదన్నారు . పార్టీలకు అతీతంగా పదవులు పొందడం కాదని ఆయన తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని పెద్దల సభకు నామినేట్ అవ్వబోతున్నారని ఢిల్లీలో తన హవా చాటబోతున్నారని ప్రచారం జరుగుతుందన్నారు. ఒకసారి రాజకీయ ముద్ర పడ్డాక ఎంత చెరుపుకున్న చెరిగిపోదని ఆయన తెలిపారు.