కొత్త రోడ్డు వేయాలని కోరతే.. పాత రోడ్డుపై కొత్త గుంతలు తవ్వి వదిలేశారు
నగర ప్రజలపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్న నగరపాలక సంస్థ ఇంజనీర్లు
కర్నూలు, న్యూస్ వెలుగు; 60 అడుగుల రోడ్డు కోసం కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని నగరపాలక సంస్థకు స్వాధీనం చేసి ఏళ్లు గడుస్తున్నా.. గుంతల్లో మట్టి వేసి రోడ్లను చదువును చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడ వల్ల రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానిక కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు న్యాయవాది ఎన్ చంద్రశేఖర్, ఏ బలరాం రెడ్డి, ఎన్ గోపీనాథ్ విమర్శించారు. ఈరోజు ఉదయం స్థానికులు పి పి ఎస్ ఎస్ నాయకులతో కలిసి విష్ణు టౌన్షిప్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతలు పడ్డ 60 అడుగుల రోడ్డుపై కొత్త రోడ్డు వేయాలని నగరపాలక సంస్థ అధికారులను కోరగా.. పాత రోడ్డుపై కొత్తగా గుంతలు తొవ్వి వదిలేసారని.. దీనివల్ల రోజు ప్రమాదాల జరుగుతున్నా.. సంబంధిత ఇంజనీరు కాంట్రాక్టర్లు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి మాట్లాడుతూ నగరంలో రోడ్లలో మరమ్మతుల పేరుతో గుంతలు తవ్వి వదిలివేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురిరౌతున్నారని అన్నారు. నగరపాలక సంస్థలో కొందరు ఇంజనీర్లు ప్రజల సమస్యలపై స్పందించకపోగా పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే గుంతలు పడ్డ రోడ్డను బాగు చేయకపోతే జరగరానిది ఏదైననా జరుగుతే పోలీస్ స్టేషన్లలో కేసులు వేస్తామని కొందరు ప్రజలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. కమిషనర్ గారు సూపరిండెంట్ ఇంజనీర్ గారు జోక్యం చేసుకొని వెంటనే కుంతలు బండ రోడ్లను బాగు చేయించాలని కోరారు.