అక్రమ నిర్మాణాలు వెంటనే కూల్చివేయాలి: ఏఐవైఎఫ్

అక్రమ నిర్మాణాలు వెంటనే కూల్చివేయాలి: ఏఐవైఎఫ్

కర్నూలు, న్యూస్ వెలుగు; సి. క్యాంప్ సెంటర్ లో ఉన్న బస్టాండ్ స్థలంలో కొంతమంది అక్రమార్కులు నిర్మించిన షాపులను వెంటనే తొలగించి బస్ షెల్టర్ ను ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఇన్చార్జి మేనేజర్ స్వర్ణలత వినతిపత్రం ఇచ్చారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు నగర కార్యదర్శి బీసన్న నగర నాయకులు కృష్ణ చంటి కుమార్ లాజర్ పాల్గొన్నారు.
శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని బస్ షెల్టర్ ను తొలగించి ప్రవేట్ షాపులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ మున్సిపల్ అధికారులు వాటిపైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటు అన్నారు. నాలుగు రోజుల నుంచి వార్త పత్రికల్లో న్యూస్ ఛానల్ లో కథనాలు వస్తున్నప్పటికీ మున్సిపల్ శాఖ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు ఈ షాపుల పైన ఏఐవైఎఫ్ గా టౌన్ ప్లానింగ్ అధికారికి సంప్రదించినప్పటికీ కనీసం వినతిపత్రం తీసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదంటే అక్రమ కట్టడాల్లో వీరికి కూడా వాటా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అలా లేని పక్షంలో టౌన్ ప్లానింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను తొలగించి ప్రయాణికులకు అక్కడ సంచరించే జనాలకి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని అదేవిధంగా మున్సిపల్ స్థలాలు అన్యక్రాంతం కాకుండా కాపాడాలని వారు మున్సిపల్ అధికారులను కోరారు. ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి ఉన్నారా లేదంటే అక్రమ దారులకు కొమ్ముకాస్తారు తెలుసుకోవాలని హెచ్చరించారు. సి క్యాంపు బస్టాండులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించడంతోపాటు ఆక్రమణకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి మున్సిపల్ అధికారులు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని లేనిపక్షంలో ఏఐవైఎఫ్ గా అక్రమ కట్టడాలను తొలగించేంత వరకు దశల ఆందోళన చేస్తామని మున్సిపల్ శాఖ అధికారుల బాధ్యత వంచవలసి ఉంటుందని హెచ్చరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!