
అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె ప్రధాన రహదారి సమీపంలో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక టిప్పర్లను ఒంటిమిట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాబడిన సమాచారం మేరకు టంగుటూరు నుంచి ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా నాలుగు ఇసుక టిప్పర్లు ఇసుకను తరలిస్తున్న నేపథ్యంలో ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె పరిసర ప్రాంతాలకు వెళ్లి నాలుగు ఇసుక టిప్పర్లను సీజ్ చేయడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Was this helpful?
Thanks for your feedback!