
బురదలో.. వారాంతపు సంత మార్కెట్..
పంచాయతీ అధికారి నిర్లక్ష్యానికి నిదర్శనం
అవస్థలు పడుతున్న గ్రామస్తులు
బండి ఆత్మకూర్, న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు మండలంలోని సంత జూటూరు గ్రామంలో ప్రతి మంగళవారం వారాంతపు సంత నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం పంచాయతీ అధికారులు సంవత్సరానికి ఒకసారి వేలంపాట నిర్వహించి ఎవరైతే హెచ్చు పాట పాడుతారో వారికి సంత మార్కెట్లో వ్యాపారం నిర్వహించే వ్యాపారస్తు దగ్గర నుంచి గేటు వసూలు చేసే అధికారం కల్పిస్తారు. పంచాయతీ కి సంత మార్కెట్ నుంచి లాభం ఉన్న సంత ఏర్పాటు చేయడానికి స్థలం లేదు. బస్టాండ్ ఆవరణ నుంచి గ్రామంలోకి వెళ్లే దారి వెంట ఇలా వారాంతపుసంత నిర్వహిస్తుంటారు.ప్రజలకి ఇబ్బంది లేకుండా వారాంతపు సంత నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ కార్యదర్శి తమకేమి పట్టనట్లు వ్యవరిస్తుందటంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు..ఈ బురదలోనే కూరగాయలు ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకోవాల్సి వస్తుందని, వాటివల్ల అనారోగ్యాల బారిన పడతామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గ లేక ఎస్సీ మేదర కాలనీలో ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలబడి దుర్వాసన వస్తుందని పిల్లలు వృద్దులు అనారోగ్యాల బారిన పడుతున్నారని కాలనీవాసులు తెలిపారు. ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు తెలిపినప్పటికీ పంచాయతీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. మండల అధికారులు చొరవ తీసుకొని మేదర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి తమ ఆరోగ్యలను కాపాడాలని కాలనీవాసులు అన్నారు. ఎస్సీ కాలనీలో వీధిలైట్లు వెళ్లడం లేదని పంచాయతీ అధికారికి ఎన్నిసార్లు చెప్పిన ప్రయోజనం లేదని గ్రామంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాగింగ్ చేయలేదని దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఇలాంటి పంచాయతీ అధికారి మాకొద్దని గ్రామస్తులు అంటున్నారు.