
గ్రామాలలో ముమ్మరంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాలు
తుగ్గలి, మద్దికేర న్యూస్ వెలుగు: తుగ్గలి, మద్దికేర మండల పరిధిలోని గల గ్రామాలలో వ్యవసాయ అధికారులు ముమ్మరంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.తుగ్గలి మండల పరిధిలోని గల ముక్కెల్ల, మారెళ్ళ రైతు సురక్ష కేంద్రాల పరిధియందు రైతులకు పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ అధికారులు మంగళవారం రోజున అవగాహనను కల్పించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ అధికారులు రైతులకు వ్యవసాయ సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలను, సూచనలను, సలహాలను రైతులకు తెలియజేశారు. పంట సాగులో తీసుకోవలసిన యాజమాన్యాల పద్ధతుల గురించి వారు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ లక్ష్మీ చైతన్య, ఎంపీఈఓ సోమేశ్వరి, విఏఏ తిమ్మప్ప,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా మద్దికేర గ్రామం నందు మండల వ్యవసాయ అధికారి రవి రైతు పరశురాముడు పొలం నందు మంగళవారం రోజున పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు సాగు చేసిన పంటల సాగు గురించి అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడి ద్వారా అధిక దిగుబడి సాధించి నికర ఆదాయాన్ని సమకూర్చుకునే విధివిధానాలను వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేశారు. వ్యవసాయ అధికారుల సూచనలను మరియు సలహాల ద్వారా రైతులు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు అని ఏ.ఓ రవి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు గూడూరు ధనుంజయుడు,విఏఏ జాకీర్ హుస్సేన్, రాణి,కవిత,ఆనంద్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu