జిల్లా విద్యాధికారి చే ఆప్టా డైరీ, కేలండర్ ఆవిష్కరణ

జిల్లా విద్యాధికారి చే ఆప్టా డైరీ, కేలండర్ ఆవిష్కరణ

కర్నూలు, న్యూస్ వెలుగు; నేడు కర్నూలు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గౌరవ విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) 2025 సంవత్సర డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. జిల్లా విద్యాధికారి గారికి గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఉత్తమ అధికారి గా ప్రశంస పత్రం వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియ చేయడం జరిగింది.కర్నూలు జిల్లా లో వున్న ఉపాధ్యాయ సమస్యలైన మెడికల్ రెయంబర్సిమెంట్, ఆన్లైన్ మొదలైన సమస్య లను ప్రస్తావించడం జరిగింది. సమస్య లపై జిల్లా విద్యాధికారి అనుకూలంగా స్పందించారు. కార్యాలయం లో సిబ్బందికి సూపర్డెంట్ రవికుమార్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు మొదలైన వారికి ఆప్టా డైరీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోఆప్టా జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సేవాలాల్ నాయక్ సీనియర్ నాయకులు మహమ్మద్ రఫీ, మహబూబ్ బాషా ,రాజసాగర్ మరియు మునగాల మధుసూదన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!