
ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల రెడ్ టి షర్ట్స్ ఆవిష్కరణ
కర్నూలు, న్యూస్ వెలుగు; డిసెంబర్ 30 న జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 16 వ జిల్లా మహాసభల ర్యాలీ కి సంబంధించిన రెడ్ టీ షర్ట్ లని మౌర్య హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ కంచర్ల హరిప్రసాద్ , డాక్టర్ వసీం హుస్సేన్ రాజా షేక్ లు , ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు , నగర కార్యదర్శి బిసన్న నగరనాయకులు చంటి లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికై జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టుల సాధన కోసం జిల్లా ప్రజలకి ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేసి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పన కోసం, స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తేవడం కోసం, జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ లో ప్రారంభం కాబోతున్న నూతన పరిశ్రమల్లో స్థానిక యువతకు 80% ఉద్యోగ అవకాశాలు కల్పించి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మెగా డీఎస్సీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఎస్సై, కానిస్టేబుల్ గ్రూప్ 1,2 నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ సాధన కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ రూపొందించుకొని సమరశీల పోరాటాలు కొనసాగించడానికి డిసెంబర్ 30,31 తేదీన కర్నూల్ నగరంలో జరిగే జరిగే అఖిల భారత యువజన సమాఖ్య 16వ జిల్లా మహాసభలు చర్చా వేదిక కానున్నాయని ఈ మహాసభకు జిల్లా నలుమూలల యువతి యువకులు పాల్గొని డిసెంబర్ 30వ తేదీన అంబేద్కర్ భవన్ నుండి ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ కార్యాలయం మీదుగా సిఆర్ భవన్ దగ్గర కేసు కెనాల్ కట్టపైన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభకు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ రాజేంద్ర బాబు, నక్కి లెనిన్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఈ గిడ్డయ్య గారు పాల్గొంటున్నారని కావున అధిక సంఖ్యలో యువతి యువకులు నిరుద్యోగులు పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు