తుంగభద్ర జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం
Kurnool (కర్నూలు ) :తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు.
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి 1,25,373 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు.
ప్రస్తుతం జలాశయంలో 1630.81 అడుగులకు గాను 97.14 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు.
ఇన్ ఫ్లోని దృష్టిలో ఉంచుకొని వివిధ కాల్వలకు, నదికి 1,54,706 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Was this helpful?
Thanks for your feedback!