బొల్లవరంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కర్నూలు జిల్లా : కల్లూరు మండలం బొల్లవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్ ఈడిగ మంగమ్మ పాల్గొని జెండా ఆవిష్కరణ చేసినట్లు గ్రామపంచాయతీ సెక్రటరీ తెలిపారు. అనంతరం జనసేన నాయకులు శివ నాయుడు మాట్లాడుతూ .. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గ్రామాల అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయితీలకు ప్రత్యేక గ్రాంటులు ఇవ్వడం సంతోషకర పరిణామామని వారు అన్నారు. జనసేన యువ నాయకులు బివిజి సతీష్ కుమార్.
మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం అనేక మంది తమ ప్రాణాలకు పణంగా పెట్టారని వారి ఆశయ సాధన దిశగా యువత అడుగులు వేయాలన్నారు. 78వ జాతీయ జెండా ఆవిష్కరణలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు శివ నాయుడు, బివిజి సతీష్ కుమార్, టిడిపి నాయకులు వెంకటరమణ, విజయ్ కుమార్, లక్ష్మన్న, మధు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిందని జనసేన నాయకులు తెలిపారు.