ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తముగా సంకట హర గణపతి హోమం
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో  ఆదివారం  సంకష్టహర చతుర్ధి సందర్బంగా దేవస్థానం
 లోని యాగశాల నందు మంగళవాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ అర్చక సిబ్బందిచే శ్రీ వినాయక స్వామి వారికి శాస్త్రోక్తముగా అభిషేకములు సంకట హర గణపతి హోమం నిర్వహించడం జరిగినది.పూర్ణిమ తరువాత వచ్చు చవితి రోజున శ్రీ విఘ్నేశ్వరుని ఆరాధించుట వలన కలి ప్రభావితము వలన వచ్చు కష్టములు దుఃఖములు హరింపబడతాయి అని ప్రతీతి.

ప్రతి నెల పౌర్ణమి తరువాత వచ్చు చవితి రోజున దేవస్థానం నందు శ్రీ సంకష్టహర చతుర్ధి హోమం నిర్వహించడం జరుగుచున్నది. ఈ సందర్బంగా ఈ రోజు దేవస్థానం నందు శ్రీ సంకష్టహర చతుర్ధి హోమం నిర్వహించడం జరిగినది.
Was this helpful?
Thanks for your feedback!
			
 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist