భవానీ నామస్మరణతో మార్మోగుతున్నఇంద్రకీలాద్రి

భవానీ నామస్మరణతో మార్మోగుతున్నఇంద్రకీలాద్రి

 విజయవాడ, న్యూస్ వెలుగు;  మూడవరోజు సోమవారము భవానీ దీక్షల విరమణలు, భవానీ నామస్మరణతో మార్మోగుతున్నఇంద్రకీలాద్రి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 3 గం. లకు అమ్మవారి దర్శనం ప్రారంభమయి వేలాది మంది భవానీలు జై దుర్గ.. జై భవాని..జై జై భవాని అను నామము స్మరించుచూ , భవానీలు గిరి ప్రదక్షణ కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాలు, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి వానీలు గిరి ప్రదక్షణ చేసే కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాలు, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా గిరిప్రదక్షణ చేసుకొని శ్రీ అమ్మవారి దర్శనము ఆనంతరము హోమగుండముల వద్ద పూజా ద్రవ్యములు సమర్పణ. భవానీల కోసం దేవస్ధానము వారు 7 లక్షల వాటర్ బాటిల్స్ ఉంచినారు. 25వ తేదీ వరకు దీక్షల విరమణ కొనసాగుతుంది. దీక్షల విరమణ చివరి రోజు డిసెంబర్ 25న ఉదయం పది గంటలకు మహాపూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయి.
భవానీ దీక్ష- 2024′ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించారు.
తొలిరోజు ఉ 6-30 నుండ రాత్రి 11 గంవరకు 42,000 మఁది భవానీలు దర్శించుకొనినారు.
రెండవరోజు ఉ 3 గం రాత్రి 11 గం వరకు 86,000 మఁది భవానీలు దర్శించుకొనినారు.
మూడవరోజు ఉ 3 గం నుండి సా 4 గంటల వరకు మంది భవానీలు దర్శించుకొనినారు.

రెండవరోజు మొత్తం
లడ్డూసేల్స్ – 3,87,926
కేశఖండన – 13,209
అన్నదానము – 21,000 మందికి (భోజనం + పులిహోర, దద్దోజనం ప్రసాదము) అందించినట్లు తెలిపారు…

Author

Was this helpful?

Thanks for your feedback!