
ఇంగలదహల్ స్కూల్ కాంప్లెక్స్ ను యథావిథిగా కొనసాగించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: ఇంగలదహల్ స్కూల్ కాంప్లెక్స్ ను యథావిథిగా కొనసాగించాలని పెద్ద గోనెహాల్,ఎం.డి.హళ్లి గ్రామ సర్పంచ్ లు పెద్దలు కేసిటిఆర్ యూత్ అసోసియేషన్ సభ్యులు గురువారం ఆలూరులో నిర్వహించిన జాబ్ మేళకు వచ్చినటువంటి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు,ఆలూరు టీడీపీ ఇంఛార్జి విరభద్రగౌడ్ వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంగలదహల్ జడ్పీహెచ్ పాఠశాల మండలంలోనే పురాతన పాఠశాలలో ఒకటి 1964 నుండి కొనసాగుతున్న పాఠశాల ఇది.నాటి పాఠశాల ప్రారంభం నుండి స్కూల్ కాంప్లెక్స్ గా కొనసాగుతుంది.ఈ పాఠశాలకు 7.65 ఎకరాల ఆట స్థలం మరియు అన్ని వసతులతో 16 విశాలమైన గదులతో లైబ్రరీ,సైన్స్ ల్యాబ్ కూడా ఉంది.పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు,ఉపాద్యేతర సిబ్బందిని కలిగి ఉంది.అలాగే సక్రమైన రవాణా సౌకర్యం కూడా కలిగి ఉంది.ఇన్ని అర్హతలు ఉన్న కూడా గుర్తించక ఎటువంట ఆర్హత లేని ఎల్లార్తి జడ్పీహెచ్ పాఠశాలను కాంప్లెక్స్ గా చేసి మా పాఠశాలను తొలగించడం అనేది అధికారుల పక్షపాతనికి నిదర్శనమన్నారు.కాబట్టి అన్ని విషయాలను పరిశీలించి విధ్యాశాఖకు సంబంధించిన అధికారులతో చర్చించి మరల ఇంగలదహల్ జడ్పీహెచ్ పాఠశాలను కాంప్లెక్స్ గా కోనసాగించడానికి సహకరించాలని కోరారు.ఇందుకు స్పందించిన ఎంపీ,ఇంచార్జి కచ్చితంగా ఈ విషయం పై అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.డి.హళ్లి సర్పంచ్ సుధాకర్,ఇంగలదహల్ ఉప సర్పంచ్ మహంతేష్,టీడీపీ నాయకులు హనుమంతు,చంద్ర, నాగరాజు,యూత్ అసోసియేషన్ సభ్యులు మల్లికార్జున,మోహన్ తదితరులు పాల్గొన్నారు.