రబీ పంటలకు ఇన్సూరెన్స్ ను చేయించుకోవాలి; ఏవో రవి

రబీ పంటలకు ఇన్సూరెన్స్ ను చేయించుకోవాలి; ఏవో రవి

మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: రైతులు రబీ పంటలకు తప్పకుండా ఇన్సూరెన్స్ ను చేయించుకోవాలని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు.బుధవారం రోజున ఆయన మాట్లాడుతూ రబీలో సాగు చేసిన వేరుశనగ,పప్పుశనగ,జొన్న,వరి, ఉల్లి,టమోటా పంటలకు సంబంధించి ప్రీమియంను చెల్లించి డిసెంబర్ 15 లోపు ఇన్సూరెన్స్ ను చేయించుకోవాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా పప్పు శనగలు పురుగు నివారణ కొరకు కోరోజాన్ పిచికారి చేసుకోవాలని,పప్పు శనగ మరియు వాములో ఆకులు పసుపుపచ్చగా మారుతున్నాయని, దీనిని నివారించడానికి ఎకరాకు ఒక కిలో 13-0-45 మరియు ఫార్ములా 4 ను కలిపి మొక్కలు తడిచేలా పిచ్చికారి చేయాలని ఆయన తెలియజేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించడం ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చని ఏవో రవి తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!