రబీ పంటలకు భీమా చేసుకోండి; రామాంజనేయులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రైతులు వేసిన రబీ పంటలకు భీమా చేసుకోవాలని జిల్లా ఉద్యానవన శాఖాధికారి రామాంజినేయులు తెలిపారు.శుక్రవారం మండలపరిధిలోని జీ.యర్రగుడి గ్రామంలో రైతులు సాగుచేసిన టమాట పంట పోలాలను పత్తికొండ హార్టికల్చర్ అధికారి దస్తగిరి తొ కలిసి ఆయన సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రబీ పంటలైన జొన్న, టమాట,వేరుశనగ,పప్పుశనగ,ఉల్లి పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన,వాతావరణ భీమా చేసుకోవాలన్నారు.ఎకరానికి జొన్నకు 297 రూపాయలు,టమాటకు 1500 రూపాయలు,వేరుశనగ కు 480 రూపాయలు,పప్పుశనగ కి 420 రూపాయలు,ఉల్లికు 1350 రూపాయలు భీమా చెల్లించాలని ఆయన తెలిపారు. రబీ భీమాను డిసెంబర్ 15 వతేది లోపు చేసుకోవాలని,రైతులు తమ పొలం పాస్ బుక్,బ్యాంక్ పాస్ బుక్,ఆధార్ కార్డు తీసుకోని గ్రామంలోని సచివాలయంకు గాని,మీ సేవా కేంద్రానికి గాని,సిఎస్సి కేంద్రానికి గాని వెళ్లి భీమా చేయించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.