ముమ్మరంగా పూడికతీత పనులు
న్యూస్ వెలుగు, కర్నూలు; నగరవ్యాప్తంగా మురుగు కాలువల్లో పూడికతీత పనులు ముమ్మరం చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సోమవారం కృష్ణానగర్, బిర్లాకాపౌండ్, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రాంతాల్లో కమిషనర్ విసృతంగా పర్యటించారు. మురుగు కాలువల్లో మురుగునీరు ప్రవాహానికి ఆటంకం లేకుండా పూడికతీత పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. పూడికతీత పనులకు ఆటంకం కలిగిస్తున్న పలు కాలనీల్లో కల్వర్టులు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఈఈ మనోహర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏఈ మనోహర్, శానిటేషన్ ఇంస్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!