
హైకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; ద్విచక్ర వాహనదారులు హైకోర్టు ఆదేశాల మేరకు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని కర్నూలు లో పోలీసులు తెలిపారు. హెల్మెట్ వాడకం పై జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కొండారెడ్డి బురుజు నుంచి సీ
.క్యాంపు వరకు పోలీసులు హెల్మెట్ ధరించి ర్యాలీ చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుంటే జరిమానా విధిస్తామని ట్రాఫిక్ సీఐ. మన్సరుద్దిన్ తెలిపారు. ఈకార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు,ఎస్.ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

