ఇంటర్మీడియెట్ ఆర్జేడీ రవి పై సమగ్ర విచారణ జరపాలి

ఇంటర్మీడియెట్ ఆర్జేడీ రవి పై సమగ్ర విచారణ జరపాలి

కడప టౌన్, న్యూస్ వెలుగు;  కడప జిల్లా ఇంటర్మీడియెట్ ఆర్జేడీ(రీజనల్ జాయిన్ డైరెక్టర్) రవి పై వస్తున్న అవినీతి ఆరోపణల పై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిగి ఆయన పై శాఖా పరమైన చర్యలు చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.కడప లో శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జిల్లా కార్యాలయం నందు విలేఖరుల సమావేశం నిగ్వహించారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ కడప ఇంటర్మీడియెట్ ఆర్జేడీ గా వున్న రవి పై అనేక సందర్భాలలో అవినీతి ఆరోపణలు వస్తునేవున్నాయని అన్నారు.అయితే ఆయన అధికార అండ బలంతో మీనేజి చేసుకుంటూ ఇంతకాలం వచ్చాడు,వస్తున్నాడు అన్నారు.గత కొద్ది రోజులుగా ఆర్జేడీ రవి పై అక్రమ బదిలీల్లో,ప్రమోషల్లలో టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులలో అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి అని అన్నారు.గతంలో కూడా ఇతను ఆర్ఐఒ గా వున్న సందర్భంలో ప్రైవేటు కళాశాలల్లో అండగా నిలబడుతూ వచ్చాడు అన్నారు. డివిఇవొ (డిస్టిక్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్) వున్న సందర్భంలో కుడా ఇదే రీతిలో వ్యవహరించాడని అనేక ఆరోపణలు వచ్చాయని అన్నారు.కావున అధికారులు ఒక కమిటీ వేసి ఆర్జేడీ రవి పై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నామని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు సమావేశంలో నగర కన్వీనర్ విజయ్,నాయకుడు వంశీ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!