
ఎస్.టి.యు క్యాలెండర్ ఆవిష్కరణ
హోలగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం మండల విద్యాశాఖాధికారులు టీ.సత్యనారాయణ,జగన్నాథం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎస్.టి.యు క్యాలెండర్ల మరియు డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పిఆర్సి,మధ్యంతర భృతి,ఆర్థిక బకాయిల చెల్లింపు,సిపిఎస్/ జిపిఎస్ రద్దు,2003 డీఎస్సీ ఉపాధ్యాయులు,2002 హిందీ పండితులకు పాత పెన్షన్,ఏకీకృత సర్వీస్ రూల్స్,జీవో 223 రద్దు చేసి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ కు జెఎల్ పదోన్నతులు,ప్లస్ టు పాఠశాలల కొనసాగింపు,కారుణ్య నియామకాలు జిల్లా యూనిట్ గా చేపట్టడం,ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బంది రేషనలైజేషన్,పురపాలక పాఠశాలల్లో పోస్టుల అప్గ్రేడేషన్,కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటిఎస్,1998,2008 డిఎస్సీ ఎంటిఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు,ఉద్యోగ భద్రత వంటి తదితర సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,కార్యదర్శులు వై.వెంకటేష్,కే.శరణప్ప,సీనియర్ నాయకులు,జే.రమేశ్,ఎస్.పోతరాజు,జి.దొడ్డబసప్ప,గోపాల్,బీ.టీ.ఖలందర్,ఎం.ధనుంజయ,కే.హనుమంతప్ప,లక్ష్మీ రెడ్డి,మూసా,శేఖరప్ప,అంజునాయక్, కే.మంజుల మరియు MRC సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.