
ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమంగా వసూళ్లపై విచారణ చేయాలి ; పి.ఎస్.ఎన్
కర్నూలు, న్యూస్ వెలుగు; సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు , ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్, స్పెషల్ ఫీజు పేరుతో కర్నూలు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్య పరిష్కార వేదికలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో పిఎస్ఎన్ జిల్లా కన్వీనర్ అమర్ కో-కన్వీనర్ మనోహర్ జిల్లా నాయకులు శంకర్ మాట్లాడుతూ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు , ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్, స్పెషల్ ఫీజు పేరుతో కర్నూలు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమంగా ఒక్కో కాలేజీ ఒక్కోరకంగా 1200 నుండి 1500 వరకు వసూలు చేస్తూ ఇంతే కాకుండా ప్రాసెసింగ్ ఫీజు పేరుతో 20 నుండి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఫీజు పేరుతో మొదటి సంవత్సరం విద్యార్థులకు 10 నుంచి 15 వేల రూపాయలు ఆ తర్వాత 2,3,4సంవత్సరం విద్యార్థులకు ప్లేస్మెంట్ కావాలంటే 10 వేలు ప్లేస్మెంట్ వద్దు అనుకుంటే 5 వేలు కనీసం వీటికి రిసిప్ట్లు కూడా ఇవ్వకుండా లక్షల రూపాయలు అక్రమంగా విద్యార్థుల నుంచి దండుకున్నారని వాపోయారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో వసూళ్లు చేస్తున్నారు ఒక్కసారిగా 5నుండి10 వేలు కట్టాలంటే పేద విద్యార్థులు కట్టలేక డ్రాప్ అవుతున్నారు. ఈ కళాశాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కార్యక్రమంలో జిల్లా నాయకులు తరుణ్, సాయినూరజ్ పాల్గొన్నారు.