FlatNews Buy Now
ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

కర్నూలు, న్యూస్ వెలుగు; ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన మహిళ ప్రసన్న శ్రీ కు వైస్ ఛాన్సలర్ పదవి కేటాయించినందుకు విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం విశ్వవిద్యాలయ ముఖాద్వారం ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రాఘవేంద్ర, జై భీమ్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విజయభాస్కర్ లు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్ర లో మొదటి సారిగా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన మహిళకు వైస్ ఛాన్సలర్ పదవి కేటాయించడం శుభపరిణామం అన్నారు. ఎరుకుల సామాజిక వర్గానికి వైస్ ఛాన్సలర్ పదివి కేటాయించి సామాజిక న్యాయం పాటించిన చంద్రబాబు, లోకేష్, పవన్ క ళ్యాణ్, పురందేశ్వరి, మధుమూర్తి కి ధన్యవాదములు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మధు కృష్ణ, టి ఎస్ ఎస్ జిల్లా కార్యదర్శి వెంకటేష్,సీనియర్ విద్యార్ధి నాయకులు పబ్బతి వెంకటేష్,విశ్వవిద్యాలయ నాన్ టీచింగ్ యూనియన్ నాయకులు రమేష్,మాలిక్,రఘు, విశ్వావిద్యాలయ టి ఎస్ ఎఫ్ నాయకులు యువరాజు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!