రైతులకు పెట్టుబడి సహాయాన్ని తక్షణమే అందించాలి

రైతులకు పెట్టుబడి సహాయాన్ని తక్షణమే అందించాలి

 2018లో ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీను రైతుల ఖాతాలో జమ చేయాలి.

 డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు తక్షణమే అమలు చేయాలి.

 సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలి.

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఎన్నికల హామీలలో భాగంగా రైతుల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన పెట్టుబడి సహాయం 20,000 రూపాయలను తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకురాలు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సోమవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని తహసిల్దార్ కార్యాలయం నందు స్పందన కార్యక్రమంలో తహసిల్దార్ రమాదేవి కు ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018లో ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీ నగదును తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని వారు తెలియజేశారు. అదేవిధంగా 2018లో అసంపూర్ణంగా మిగిలిపోయిన రైతు రుణమాఫీ బకాయిలను తక్షణమే చెల్లించాలి వారు తెలియజేశారు.అదేవిధంగా రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని వారు తెలియజేశారు.డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు తక్షణమే అమలు చేయాలని,అదేవిధంగా తుగ్గలి మండలంలో గల చెరువులను హంద్రీనీవా జలాలతో నింపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే రాష్ట్రంలో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం తాలూకా అధ్యక్షులు ఉమాపతి, మండల అధ్యక్షుడు రామానాయుడు, తుగ్గలి కార్యదర్శి చదువుల కాశీనాథ్, మండల కోశాధికారి మాబు పీరా, నాగరాజు,లాలన్న,రంగన్న తదితర నాయకులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!