అంగన్వాడి పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
హోళగుంద, న్యూస్ వెలుగు: ఐసిడిఎస్ ఆలూరు ప్రాజెక్ట్ పరిధిలో హోళగుంద మండలంలో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడి కార్యకర్తలతో పాటు నాలుగు ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు సిడిపిఓ బాలమణి,సూపర్ వైజర్ శిబా రాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.హోళగుంద బిజీ హళ్లి అంగన్వాడి కార్యకర్త (బిసి),ముగుమానగుంది అంగన్వాడి కార్యకర్త (బిసిడి), ఆయా గజ్జెహళ్లి (బిసిడి) కోగిలతోట (ఎస్సీ),హేబ్బటం (ఎస్టి),నేరణికి (ఈడబ్ల్యూఎస్) ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.అంగన్వాడి పోస్ట్ కు పదవ తరగతి పాస్ అయి ఉండి 2024 జూలై 1వ తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి 35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు ఆయా పోస్టులకు ఏడవ తరగతి ఉత్తరేణిలై ఉండి 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు నిండి 35 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు.అంతేకాకుండా వివాహితురాలై స్థానిక నివాసితురాలై ఉండాలని వివరించారు.దరఖాస్తులను ఈనెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆలూరు ఐసిడిఎస్ కార్యాలయంలో అందజేయాలని కోరారు.మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.