
పగిడిరాయి గ్రామ దేవర ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవికు ఆహ్వానం
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని పగిడిరాయి గ్రామంలో ఈనెల 21,22 తేదీలలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రామ దేవర ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కు గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌరవ సలహాదారుడు హనుమంతు ఆహ్వాన పత్రాన్ని శుక్రవారం కర్నూల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే స్వగృహం నందు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌరవ సలహాదారుడు హనుమంతు మాట్లాడుతూ తమ గ్రామంలో 5 సంవత్సరాల తర్వాత జరుగుతున్న గ్రామ దేవతల దేవర ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కు ఆహ్వాన పత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు.మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి దేవర ఉత్సవాలకు హాజరవుతానని తెలిపినట్లు గ్రామపంచాయతీ సర్పంచ్ గౌరవ సలహాదారుడు హనుమంతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జగన్నాథ్ రెడ్డి,పగిడిరాయి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!