
ఇది మంచి ప్రభుత్వం”పేరుతో ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం
మంగళగిరి, న్యూస్ వెలుగు; మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎన్డీయే 100 రోజుల పాలనపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో చర్చించారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటికింటీ వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. వందరోజుల పాలన ప్రగతిని “ఇది మంచి ప్రభుత్వం”పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్ళనున్నారు
Was this helpful?
Thanks for your feedback!