పేద ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం

పేద ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ

కర్నూలు, న్యూస్ వెలుగు; కూటమి ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. విద్యుత్ చార్జీల సర్దుబాటు పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు పరిగెల మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో కర్నూలు నగరం కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న విద్యుత్ భవన్ ఎస్ ఈ కార్యాలయం ముందు శుక్రవారం సాయంత్రం లాంతర్లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా పరిగెల మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై 5 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారనీ అత్యంత దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపుతున్నారని. ఇప్పటికే రూ.6 వేల కోట్ల భారం మోపారని ఇది చాలదు అన్నట్లు ఇంకో రూ.11వేల కోట్లు సిద్ధం చేశారని మొత్తం రూ.17 వేలకోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారని మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా జగన్ మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో రూ.35 వేల కోట్లు భారం మోపితే మీ 5 నెలల పాలనలో రూ.17 వేల కోట్లు భారమా ఇది న్యాయమా చంద్రబాబు విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి అన్నారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలనీ మురళీకృష్ణ గారు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ విద్యుత్ ఛార్జీలపై ఎన్నో హామీలు ఇచ్చారని వైసీపీ 9 సార్లు ఛార్జీలు పెంచిందని గగ్గోలు పెట్టారని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదంటూ ప్రగల్భాలు పలికారనీ తీరా అధికారంలో వచ్చాకా మాట మార్చారనీ ఇప్పటికైన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అండగా ఉండాలని మురళీకృష్ణ గారు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు షేక్ జిలాని బాష, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, పార్లమెంట్ సమన్వయకర్త పిజి రాం పుల్లయ్య యాదవ్ పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, ఐఎన్టియుసి అధ్యక్షులు బి బతకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్సీ బజారన్న, కే రాఘవేంద్ర రెడ్డి, అనంతరత్నం, ఈ లాజరస్ ఎజాస్ అహ్మద్, ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, షేక్ ఖాజా హుస్సేన్, సయ్యద్ ఖాద్రి బాషా, సాంబశివుడు, డబ్ల్యూ సత్యరాజు, షేక్ మాలిక్ భాష, బి సుబ్రహ్మణ్యం, ఐఎన్టియుసి నాయకులు సుంకన్న, ప్రతాప్, ఆనంద్, మహిళా కాంగ్రెస్ కరుణమ్మ అయ్యమ్మ పద్మావతి మొదలగువారు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!