
ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎస్ వి దంపతులు
శివ దీక్షాపరులకు 25 సంవత్సరాల నుంచి అన్నదానము
కర్నూలు, న్యూస్ వెలుగు; శుక్రవారం మాజీ ఎమ్మెల్యే , వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ అధ్యక్షురాలు ఎస్ వి విజయ మనోహర్ నగరంలోని నగరేశ్వర స్వామి దేవాలయంలో శ్రీశైల శివ దీక్ష పరుల సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఎస్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నగరేశ్వర స్వామి దేవాలయంలో గత 25 గత సంవత్సరాల నుంచి శివమాల ధరించిన శివ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైన విషయమని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గత 25సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం, ఆ కైలాసనాధుడి కృపా కటాక్షాలు శివ దీక్షాపరుల సేవా సమితికి ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు. ఇదే సందర్భంగా నగరంలో ఉన్న శివ దీక్ష స్వీకరించిన భక్తులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు శ్రీమతి ఎస్.వి. విజయ మనోహరి గారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని శివదీక్ష స్వీకరించిన స్వాములకు సేవ చేయడం అంటే భోళా శంకరుడికి సేవ చేసినట్లేనని అన్నారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు భక్తులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.