అధికారికంగా వడ్డె ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించడం హర్షంచదగ్గ విషయం

అధికారికంగా వడ్డె ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించడం హర్షంచదగ్గ విషయం

  వడ్డెర  సంఘాల  నాయకుల ధన్యవాదాలు

కర్నూలు, న్యూస్ వెలుగు; వడ్డె ఓబన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిండం సంతోషంగా ఉందని వడ్ఖెర సంఘల నాయకులు కర్నూలు లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. వడ్డెర కులస్ధుల అభిష్టం నేరవేర్చినందుకు కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వడ్డె కులస్తులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు ఈసందర్భంగా కోరారు. వడ్ఖెర లను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు. తమకులానికి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి నామినేటెడ్ పదవులు కల్పించాలని వారు కోరారు.
వడ్డె ఓబన్న జయంతి లాగే వర్థంతి ని సైతం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో గుంజ వెంకటస్వామి మాజీ కార్పోరేటర్,మక్కల శ్రీనివాసులు శ్రీశైలం అన్నదానం సత్రం సెక్రటరీ, నాగరాజు, రామాంజనేయులు, వెంకటేశ్వర్లు, టైలర్ వెంకటేశ్వర్లు, లక్ష్మీ నారాయణ, వెంకట కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!