
ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం
*ప్రజా ఆకాంక్షలకు,అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది.
*వంద రోజుల్లోనే మెగా డీఎస్సీ నిరుద్యోగ యువతకు భరోసా
హోళగుంద,న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు,అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్
అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ కార్యక్రమానికి ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా టీడీపి ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ సుధీర్ఘగా రాజకీయ చరిత్ర గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారన్నారు.ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షేమంలోనూ సంక్షేమ అందించి,అభివృద్ధికి రెక్కలు తొడిగి,మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత మన్ననలు పొందిందన్నారు.ముఖ్యంగా మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.అలాగే మెగా డీఎస్సీ తో 16,437 ఉపాధ్యాయ పోస్టులో భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబెడుతుందని తెలియజేశారు.గత ప్రభుత్వం అవ్వ తాతలకు రూ.250 పెన్షన్ పెంచడం తప్ప మరే ఇతర హామీని అమలు చేయలేదని,మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజల ధన,మాన,ప్రాణాలకు,ఆస్తులకు రక్షణ ఉండేది కాదన్నారు. అయితే నేడు చంద్రన్న చల్లని పాలనలో ప్రజలు స్వేచ్చగా జీవించగలుగుతున్నారన్నారు.అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా పొలం పిలుస్తుంది కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు.మరియు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో డీఎల్డిఓ నాగేశ్వర రావు,ఎంపీడీఓ సుహసీనమ్మ,అగ్రికల్చర్ ఏడిఏ డిఆర్సి కర్నూలు వేదమాణి,ఏడిఏ సునీత,ఎస్ఐ బాల నరసింహులు,ఏపిఓ భక్తవత్సలం,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్,ఏఓ ఆనంద్ లోకదళ్,నాయకులు పంపన్న గౌడ,పంపాపతి,కాడప్ప,మురళీ,ఎర్రి స్వామి,వెంకటేష్,రామాంజిని,బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,మండల అధ్యక్షులు ప్రసాద్,జనసేనా మండల కన్వీనర్ అశోక్, బసవరాజ మంజునాథ హుస్సేన్ పీరా చుట్టూ పక్కల గ్రామాల కూటమి పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.