
జిల్లా ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉండడం బాధాకరం..
ఆర్థిక ఇబ్బందులతో నా పిల్లల బడి మాన్పించాను.ప్రభుత్వమే చదివించాలని వేడుకున్న దలిత మహిళ
పిల్లల ఫీజు చెల్లించి బడిలో చేర్పించిన పట్టణ పౌర సంక్షేమ సంఘం:ప్రజల తలసరి ఆదాయం పెంచాలని డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు; భర్త చిరు వ్యాపారం..భార్య ఇండ్లలో పని చేస్తూ ముగ్గురు పిల్లలను చదివించుకుందామని పశ్చిమ ప్రాంతం నుంచి
పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం యాకోబు గారు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా అనంతరం రెండు మండలాలు మినహా రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం జిల్లాలో పరిశ్రమలు నిర్మించి సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ఉపాధిని పెంచడంపై శ్రద్ధ పెట్టి ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ప్రభుత్వం స్పందించి మా పిల్లలను చదివించాలని తల్లి సుజాత ప్రభుత్వాన్ని కోరింది. పిల్లలను బడిలో చేర్పించిన ప్రతినిధి బృందంలో కె చంద్రమౌళి, ఎన్ పీటర్,ఎస్ రమణ గౌడ్,మహమ్మద్ యూనుస్, ఎస్ మద్దిలేటి, కే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.ఇరిగినేని పుల్లారెడ్డి