సోమశిల జలాలను నింప లేకపోవడం దురదృష్టకరం

సోమశిల జలాలను నింప లేకపోవడం దురదృష్టకరం

ఒంటిమిట్ట చెరువుకు శాశ్వత నీరు అందించాలి
  ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు;  కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట చెరువుకు శాశ్వత నీరు అందించాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు పోతుగుంట. రమేష్ నాయుడు మండల కేంద్రమైన ఒంటిమిట్ట బిజెపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో అన్నాడు. ఒంటిమిట్ట చెరువుకు శాశ్విత నీరు అందించే క్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు బాలరాజు. శివరాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చేందుకు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు పోతుకుంట. రమేష్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడుతూ బహు విస్తీర్ణం కలిగిన ఒంటిమిట్ట చెరువుకు ప్రభుత్వం శాశ్వత నీరు అందించాలని కోరడం జరిగింది.2014 సంవత్సరంలో సోమశిల వెనుక జలాల నీటిని ఒంటిమిట్ట చెరువులో నింపేందుకు ఒక మంచి ప్రయత్నంగా ప్రభుత్వం పైపింగ్ సిస్టం ఏర్పాటు చేయడం చాలా సంతోషం అన్నారు. గత ప్రభుత్వంలో నాయకుల అధికారుల నిర్లక్ష్యం కారణంగా పైపులకు తుప్పుబట్టి ఎక్కడపడితే అక్కడ పగిలిపోవడం జరగడంతో ఒంటిమిట్ట చెరువులో సోమశిల జలాలను నింప లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి యుద్ధ ప్రాతిపదికన పైపింగ్ మరమ్మత్తులు చేయించి చెరువులో నీటిని నింపి కోదండరామస్వామి దర్శనార్థం వస్తున్న భక్తులకు ఒంటిమిట్టలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి పాడి పోషణ వ్యవసాయకరంగంలో రైతన్నలు అభివృద్ధి సాధించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఆ దిశగా ప్రభుత్వాధికారులు ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాటూరి. గంగిరెడ్డి, సుబ్బారెడ్డి ,భాను ప్రకాష్ రాజు తదితరులు ఉన్నారు

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!