అపరిశుభ్రత లేని గ్రామాలుగా చూడాలి

అపరిశుభ్రత లేని గ్రామాలుగా చూడాలి

ఆలూరు, న్యూస్ వెలుగు;  జిల్లా ఆలూరులో , స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు. మండల అధికారులతో కలిసి స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు . అనంతరం కార్మికులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కూటమి ప్రభుత్వం స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం పేరుతో గ్రామంలో అపరిశుభ్రత లేని గ్రామాలుగా ఉండాలని ఉద్దేశంతో, మండలానికి ఒకటి చొప్పున స్వచ్ఛరథాన్ని ఏర్పాటు చేసందని ప్రతి నెల మూడో శనివారం ఒక్కొక్క డిపార్ట్మెంట్తో కోఆర్డిట్ చేసుకుంటూ గ్రామ గ్రామన కాలనీలో పొడి చెత్త ,తడి చెత్తను సేకరించి వాటి ద్వారా వివిధ రకాల ఎరువులు, తయారుచేసి తిరిగి రైతులకు అందుబాటులోకి తెస్తుందని, అలాగే ప్రజలు కూడా ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను ఐరన్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులను ఒకచోట పెట్టుకుంటే స్వచ్ఛ రథం వాహనం వచ్చినప్పుడు వాటిని ఇస్తే తిరిగి వాళ్లకి నిత్యవసరస్తులు నూనె , పేస్టు తదితర వస్తువులను ఇస్తుందని పేర్కొన్నారు. చెత్త ద్వారా సంపద వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను చేపడుతుందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకొని, అపరిశుభ్రత లేని గ్రామాలుగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు, అలాగే టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS