ఆధానీ కంపిని పై దాడి చేసింది వైసీపీ కాదు… ఎన్డీఏ కూటమి నాయకులే..
మాజీ మంత్రి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; శుక్రవారం నాడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి శాసనమండలి ప్రాంగణంలో మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గ కొండాపురం మండలం రాగికుంట లో ఆదాని గ్రూప్ సంస్థ పై దాడి చేసింది వైసిపి నాయకులు కాదని ఎన్డీఏ కూటమి నాయకులే. ఆ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ పార్టీకి అంటగడుతున్నారు. ఆ కంపెనీ ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్ గా ఎంపీ సీఎం రమేష్ నాయుడు కి వచ్చింది.ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం వెళ్లి అక్కడ కంపిణి పై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారు. దాడి వీళ్ళు చేసి అక్కడ వైసిపి వాళ్ళు కాంట్రాక్టర్ చేస్తున్నారని తెలిసి అక్కడికి మా పార్టీ నాయకులు వెళ్లారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అంటున్నారు. ఆ కాంట్రాక్టర్ వైసిపికి రాలేదు సీఎం రమేష్ నాయుడు గారికి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా వైసిపిపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదు అని ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఖండించారు.