ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన టిడిపి ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి
మైలవరం, న్యూస్ వెలుగు; మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమలవుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. మైలవరం మండలం బెస్త వేముల గ్రామం నందు మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన భూపేష్ రెడ్డి మాట్లాడుతూ బెస్తవేముల గ్రామపంచాయతీకి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళికి ప్రారంభిస్తున్నామన్నారు, త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేనేత కుటుంబాలకు ప్రభుత్వం చెప్పినట్లు ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు సర్పంచ్ మొలక సరస్వతి, మచ్చా వెంకటసుబ్బయ్య, మచ్చా రాజకులయప్ప, నల్లబోతుల నాగయ్య, గోపు లక్ష్మయ్య, మచ్చా దేవేంద్ర, కుమ్మర వెంకటరామయ్య, మొలక వెంకటేశ్వర్లు, శివ యాదవ్, గోపాల్ యాదవ్, సంజీవ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.