అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; గోసేవే గోవిందుడి సేవ అని, గోజాతి సంరక్షణతో సమస్తమైన సంపదలు, శుభాలు కలుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన బండి ఆత్మకూరు లోని శ్రీలక్ష్మీ జనార్ధన స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిశాయి. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్ జీ చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను విశేషంగా అలరించాయి. ప్రతిరోజూ స్ధానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులు గుండా సునీత, ఆలయకమిటి సభ్యులు బైరెడ్డిలక్ష్మీరెడ్డి సీమకృష్ణారెడ్డి, ఇటికెల శివారెడ్డి సీమ నారాయణ రెడ్డి,ఆలయ అర్చకులు వీరాచార్యులు, సుధాకర్ శర్మ,
రాఘవాచార్యులు, భజన మండలి సభ్యులు భైరెడ్డి శివారెడ్డి, బండి సుబ్బారెడ్డి, సీమ వెంకటరామిరెడ్డి, లింగాల మల్లికార్జున,గుండా లక్ష్మీదేవి, రాజేశ్వరమ్మ, మామిడి ప్రసాద్, భేమిసెట్టి నాగేశ్వరయ్య, మామిడి రామకృష్ణయ్య, కోడి పుల్లయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.