హిందూ మనోభావాలను దెబ్బతీసిన జగన్
గోవిందా…గోవింద…తిరుమల లడ్డు గోవింద.
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో ఆదివారం గెజ్జేహళ్లి గ్రామంలో కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి పిలుపుమేరకు భారతి జనతా పార్టీ కిషన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ రామలింగ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు భారతీయ గోవు గోష గోవిందా…గోవింద…తిరుమల లడ్డూ గోవింద కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగడాల జగన్….కల్తీల జగన్ ని కఠినంగా శిక్షించాలని కోరారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యిని వాడి హిందూ మనోభావాలను దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డిని భగవంతుడే శిక్షించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో జగన్నాథ ఆచారి,రంగస్వామి,భీమేష్,శేఖర్,గాదిలింగ,పెద్ద శేఖర్,శివుకుమార్,రాము,శాగప్ప తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!