ఆదాని – అంబానీల సేవలో నాడు జగన్, నేడు చంద్రబాబు

ఆదాని – అంబానీల సేవలో నాడు జగన్, నేడు చంద్రబాబు

బడ్జెట్ లో కర్నూలు జిల్లాకు తీరని అన్యాయం

ఇరిగేషన్ ప్రాజెక్టులకు అరకొర నిధులు పేదలకు పట్టణ ప్రాంతాలో రెండుసెంట్లు – గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాల్సిందే… కె రామకృష్ణ

కర్నూలు, న్యూస్ వెలుగు; నేడు సీఎం చంద్రబాబునాయుడు నాడు జగన్ మోహన్ రెడ్డిలు ఆదాని- అంబానీలలో నేవలో తరిస్తున్నారని, బడ్జెట్లో కర్నూలుజిల్లాకు తీరని అన్యాయం చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు అరకొర నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వంను విమర్శించారు. గురువారం సీఆర్ భవన్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ అధికారంలో చంద్రబాబునాయుడు,నాడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి లు ఇరువురు కూడా ఆదాని- అంబానీల సేవలో తరిస్తున్నారని, రాష్ట్రంలోని అనేక పోర్టులు వారికి అప్పగించారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చలే జరగడం లేదన్నారు. కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ గైరు హాజరు కావడం వలన చర్చలు జరగడం లేదన్నారు.రాష్ట్రం దివాళ తీసిందని, అప్పుల్లో ఉందని ఒకవైపు చెప్పుతూనే బహుబలి బడ్జెట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నారు. కానీ లోటు ఎలా తీరుస్తారో, చెప్పలేదన్నారు. బడ్జెట్లో ఇరిగేషన్ కు నిధులేవి …… రాష్ట్రంలో వ్యవసాయంపై 62శాతం జీవనం సాగిస్తుంటే బడ్జెట్లో వ్యవసాయంకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఇరిగేషను మొత్తం బడ్జెట్లో కనీసం 10 శాతం నిధులు కేటాయించలేదన్నారు. గురురాఘవేంద్రకు 34 కోట్లు, వేదవతి, ఆర్డీఎన్, ఎల్ఎల్ సీ కి 35 కోట్లు మాత్రమే కేటాయించారని ఇంత అద్వాన్నంగా నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో 30 నం పడుతుందన్నారు.. కర్నూలుజిల్లా దక్షిణ భారతదేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిందన్నారు. జిల్లాలో వలసలు పెరిగి పోయాయన్నారు.అధిక నిధులు కేటాయించి పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని రాష్ట్రవ్యాప్తంగా అందోళలు చేస్తామని . హెచ్చరించారు.
ఎన్నికల వాగ్దానం తుంగలో తొక్కారు….. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయినా చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు పట్టణ ప్రాంతాలో రెండుసెంట్లు గ్రామీణ
ప్రాంతాల్లో మూడు సెంట్ల నివాసస్థలం ఇస్తామని టిడ్కో గృహాలు లబ్దిదారులకు అప్పగిస్తానని హామీ ఇచ్చి నేడు బడ్జెట్లో కనీసం 10వేల కోట్లు కేటాయించ లేదన్నారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానంను తుంగలో తొక్కారన్నారు. చంద్రబాబునాయుడు దేశ జనాభా పెంచాలని ఎక్కు వ మంది సంతానంను కనాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు నేడు ప్రపంచంలో జనాభాలో భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నారు. 146కోట్ల జనాభా ఉందన్నారు. పేదరికంలో కూడా భారతదేశం మొదటి స్థానంలో ఉందని అయితే చంద్రబాబునాయుడం జనాభా పెంచాలని ఎలా చెపుతారని ప్రశ్నించారు. ఉన్న జనాభాకు నరైన మౌళిక వనతులు. లేక ఇబ్బందులు పడుతున్నారని. రైతులు అప్పులతో ఆత్మహత్యలకు పొల్పడుతున్నారని, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చజరగాల్సిన అదనరం ఉందన్నారు. క్రిష్ణా నది నీటిని విభజన సమయంలో కేటాయించిన విధంగా వాడుకోవాలన్నారు. రెచ్చకొట్టే ప్రకటనలు ఎవరూ కూడా చేయకుడదని, ఏపీతో పాటు తెలంగాణా, కర్నాటక రాష్ట్రాలు పరస్పర సహకారంతో వ్యవహరించాలన్నారు. రాజకీయంగా సిద్ధాంత పరంగా ఒకరి పై మరోకరు విమర్శలు చేసుకోవచ్చని. వ్యక్తి గత దూషణలు చేసుకోవడం, కుటుంబాలను రాజకీయాల్లోకి లాగడం సమంజసం కాదన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా పోసాని మురళీకృష్ణ చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ను దూషించడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. వైసీపీ అసెంబ్లీకి హాజరై ప్రజల తరుపును మాట్లాడాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, సహాయ కార్యదర్శి ఎన్ మునెప్పు, సీనియర్ నాయకులు కె జగన్నాధం నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జే చంద్రలేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!