
ఏ క్షణమైనా జగన్ కు జైలు తప్పదు ; పాలకుర్తి తిక్కారెడ్డి
జగన్ అధికారంలో ఉండగా మదంతో బాబు కక్షసాధింపులకు పోయాడు, కోర్టులలో శృంగభంగం పాలయ్యాడు
జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి వెల్లడి
కర్నూలు, న్యూస్ వెలుగు; చంద్రబాబునాయుడు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలనీ గత జగన్ ప్రభుత్వం వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో శృంగభంగం పాలయ్యాడనీ కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి వెల్లడించారు. ఈ విషయమై వారు పత్రికల మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉ న్నప్పుడు అధికారమదంతో అప్పటి ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు కక్షసాధింపులకు పూనుకొని అర్ధం పర్ధం లేని కేసులలో ఇరికించేందుకు సర్వప్రయత్నాలు చేసి చివరికి 2023 సెప్టెంబర్ 9న స్కిలెవలప్మెంట్ లో 240 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారన్న నెపంతో సి.ఐ.డి ని అడ్డంపెట్టుకొని చంద్రబాబునాయుడు అక్రమంగా అర్ధరాత్రి సి.ఐ.డి. పోలీసుల చేత అరెస్టు చేయించి వారిని 52 రోజులపాటు జైలులో ఉంచి శునకానందంపొందారు. జగన్ ప్రభుత్వం మోపినటువంటి ఆరోపణలో కనీసం చంద్రబాబు ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడినట్లు రుజువు చేయలేకపోయిందనీ, చివరికి చంద్రబాబు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందనీ గుర్తుచేశారు. అక్టోబర్ 31న చంద్రబాబు విడుదలై బయటకు వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించారనీ అన్నారు. అయితే సాక్షులను ప్రభావతిం చేస్తారంటూ వై.యస్. జగన్మోహన్రెడ్డి చంద్రబాబు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ కోట్లాది రూపాయాల ప్రజాధనాన్ని పొన్నవోలు సుధాకరరెడ్డి, మరియు సుప్రీంకోర్టు న్యాయవాదులకు వెచ్చించీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేయించారనీ, అక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆపిటీషన్ ను డిస్మిస్ చేసిందనీ. అంతేగాక జగన్ మరొక పత్రికా విలేకరి బాలగంగాధరతిలక్ అనునతనితో కూడా బెయిల్ద్దు కోరుతూ పిటీషన్ వేయించగా దానిని కొట్టివేస్తు అతనిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
గతంలో జగన్ తండ్రి వై.యస్. రాజశేఖరరెడ్డి శ్రీ చంద్రబాబునాయుడు 29 ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలో నిజనిర్ధారణ కమిటీని వేయగా అకమిటీ సుదీర్ఘకాలంపాటు అధ్యనం చేసి ఆరోపణలలో ఏలాంటి నిజాలు బయట పెట్టలేకపోతే ఆయన వేసిన కమిటీని ఉపసంహరించుకోవడం జరిగిన విషయము, అలాగే జగన్ తల్లి విజయమ్మ చంద్రబాబునాయుడు అవినీతి ఆరోపణలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లగా అందులో ఎలాంటి నిజాలు లేవనీ, ఇది కేవలం డస్టుబిన్ కేసుగా పరిగణించాల్సిఉంటుందనీ హెచ్చరించారు. ప్రస్తుతం స్కిల్ కేసులో కూడా న్యాయస్థానంలో అదే జరిగిందనీ గుర్తుచేస్తున్నా. చట్టం, న్యాయం, ధర్మం, అనే వాటిని చంద్రబాబునాయుడు గారు నమ్మి పనిచేస్తున్న పాలనాధక్షత కలిగి వారనీ అలాంటి ఆరోపణలు చేసినటువంటి జగన్కు దొరికేది కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు ఉంటుంది తప్ప ఎలాంటి అవినీతి ఆనవాలు దొరకవనీ తెలియజేస్తున్నా.
మే13 2024లో ప్రజాక్షేత్రంలో జగన్కు పరాభవం జరిగితే నిన్న సుప్రీంకోర్టులో అదే జరిగిందనీ, ఇకనైనా జగన్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ మానుకోవాలనీ హితవు కోరుతున్నాను. ఎప్పటికైనా చంద్రబాబు గారు కడిగిన ముత్యం అవుతారు తప్ప ఏ మరకా వారికి అంటదనీ, 22 ఈ.డి. కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ బెయిల్ పై బయట తిరుగుతున్నానన్న సంగతి మరువవద్దనీ గుర్తుచేస్తున్నా. ఏ క్షణమైనా నీకు జైలు తప్పదు. ఈ విషయం గుర్తుంచుకో జగన్,
పాలకుర్తి తిక్కారెడ్డి తెలుగుదేశంపార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, కర్నూలు.