
జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా..
ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అమలవుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామం నందు మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ మోరగుడి గ్రామపంచాయతీకి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళికి ప్రారంభిస్తున్నామన్నారు, త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేనేత కుటుంబాలకు ప్రభుత్వం చెప్పినట్లు ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు టిడిపి ఇంచార్జ్ భూపేష్ రెడ్డి, మోరగుడి సర్పంచ్ సిజే కొండయ్య,ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.


 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra