రాష్ట్ర పండగగా కనకదాస జయంతి

రాష్ట్ర పండగగా కనకదాస జయంతి

అమరావతి: ఈ నెల 18న గురు కనకదాస జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.త న కీర్తనలు, సాహిత్యంతో సమాజ అసమానతలపై గొంతెత్తిన సాహిత్యకారుడు, సంఘ సంస్కర్త గురు కనకదాస అని అన్నారు. కర్నాటకలో జన్మంచిన కనకదాస… రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని అన్నారు. ఇటువంటి మహానీయుని జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, పంచాయతీ స్థాయిల్లోనూ కనకదాస జయంతి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అనంతపురంలోని గుత్తిరోడ్డు కేటీఆర్ ఫంక్షన్ హాల్లో కనకదాస జయంతి నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు. బీసీలను, వారి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ… వారి ఉన్నతి కోసం సీఎం చంద్రబాబునాయుడు ఎంతో ప్రాధాన్యతమిస్తున్నారన్నారు. ఇటీవలే వాల్మీకి జయంతిని, విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండగలు జరుపుకున్నామన్నారు. ఇపుడు గురు

Author

Was this helpful?

Thanks for your feedback!