
భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం
శ్రీ బాల ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.
భక్తులతో కిక్కిరిసిన ఆలయం
కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న అశేష భక్త జనం.
హొళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం కార్తీకమాసాన్ని పురస్కరించుకుని శ్రీ బాల ఆంజనేయ స్వామి దేవాలయంలో సాయంత్రం మహిళలు,యువకులు ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.భక్తాదుల ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాని ఏర్పాటు చేశారు.ప్రధానంగా జై శ్రీ రామ్,శ్రీ,స్వస్తిక్,గాధ తదితర అకృతులలో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!