
ఘనంగా గౌడ సంఘం కార్తీక వనభోజన మహోత్సవం
న్యూస్ వెలుగు, బనగానపల్లె; బనగానపల్లె పట్టణంలోని రవ్వలకొండపై వెలసిన హట్టి మునిస్వామి దేవస్థానంలో శుక్రవారం ఈడిగ (గౌడ) కులస్తుల కార్తీక వనభజన మహోత్సవం అత్యంత వైభవంగా-జరిగింది. మండల స్థాయిలో జరిగిన ఈ వనమహోత్సవ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ఈడిగ తిరుపాల్ గౌడ్, ఈడిగ వెంకటరమణ (దేవుడు) ప్రధానోపాధ్యాయులు హరినాథ్ గౌడ్ ల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముందుగా సామూహిక గోమాత పూజ, కులదేవత రేణుకా ఎల్లమాంబకు విగ్రహనికి కుంకుమార్చన , పుష్పార్చన, కులస్తుల పరిచయ కార్యక్రమం, వక్తలచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గౌడ కులు హాజరై హాజరయ్యారు.ఈ సందర్భంగా దొంతా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బనగానపల్లి రవలకొండపై రేణుక ఎల్లమ్మ దేవస్థానం నిర్మాణానికి తాను సొంతంగా 26 సెంట్లు స్థలాన్ని కేటాయించానని అన్నారు. ఈ దేవస్థానం నిర్మాణానికి గౌడ సంఘీయులు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని ఆయన కోరారు.