క్యాటరర్స్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం
న్యూస్ వెలుగు, కర్నూల్; కార్తీక మాసం సందర్భంగా కర్నూలు లో వనభోజన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా క్యాటరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని రాంబొట్ల దేవాలయ కళ్యణ మండపంలో వనభోజనాలు ఏర్పాటు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా క్యాటరర్స్ ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. జిల్లాలో ఎవరైనా క్యాటరర్స్ కు ఆపద వస్తే అసోసియేషన్ ఆధ్వర్యంలో సహయసహకారాలు అందిస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో క్యాటరర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎస్. సత్యనారాయణ, అధ్యక్షుడు శేషయ్య, కార్యదర్శి ప్రసాద్, ట్రెజరర్ సీఎస్. ప్రసాద్, సలహాదారుడు ప్రాణేష్, జాయింట్ సెక్రటరీ మారుతి శర్మ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!