
వెల్దుర్తిలో ఘనంగా K.E శ్యాంబాబు పుట్టినరోజు వేడుకలు
వెల్దుర్తి న్యూస్ వెలుగు: మండల కేంద్రమైన వెల్దుర్తిలో శ్రీగిరి గోవర్ధన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ఉచిత రక్తదాన శిబిరంలో మండల మాజీ ఎంపీపీ ఎల్.ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేక్ కట్ చేసిన కె ఈ శ్యాంబాబు కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి పండ్లు, ఫ్రూట్స్ జ్యూస్ అందజేఅందించారు. సేకరించిన రక్తాన్ని కర్నూలు మేడిప్లస్ బ్లడ్ సెంటర్ కు పంపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల టిడిపి అధ్యక్షుడు అమర్నాథ్ గౌడ్, వెల్దుర్తి బిజెపి మండల అధ్యక్షురాలు శాంతి, మాజీ జెడ్పిటిసి ఐజయ్య, జనసేన నాయకులు నాయకంటి బాబ్జి నాయకులు సిద్ధన గట్టు వెంకటేశ్వర్లు , ఎమ్మార్పీఎస్ నాయకులు గిడ్డయ్య, మల్లికార్జున, జయన్న ఆచారి, రత్నపల్లి ఆనంద్ యాదవ్, పూల రాముడు,హరి,రాజేష్,నాగ సురేంద్ర, వడ్డే మహేష్ రంగస్వామి తదితర నాయకులు శిబిరంలో పాల్గొన్నారు.




