ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ మద్యంషాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ మద్యంషాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌

అమరావతి, న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యంషాపుల( Government Liquor shops ) ను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ను(Ordinance) తీసుకొచ్చింది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం రిటైల్‌ లిక్కర్‌ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది.

అక్టోబర్‌ 1 నుంచి కొత్త లిక్కర్‌ పాలసీ రాబోతుంది. ఇటీవల కొత్త లిక్కర్‌ పాలసీకి క్యాబినేట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ హయాంలో 2014-19 వరకు ఉన్న మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరపనున్నారు. మద్యం రిటైల్‌ వ్యాపారం మొత్తం ప్రైవేట్​కే అప్పగించనున్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా మద్యం షాపులను జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 3396 వైన్ షాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నారు. మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!