ఎమ్మెల్యే కే ఈ శ్యాం బాబు కీలక నిర్ణయం..
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఎమ్మెల్యే కే శ్యాం బాబు పూలదండలు శాలువాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చే నాయకులు గాని కార్యకర్తలుగాని అధికారులుగాని అభిమానులు గాని పూలదండలు గాని శాలువాలు గాని తీసుకురారాదని తెలియజేశారు. అభిమానానికి పలకరింపు చాలని అనవసరంగా ఖర్చులు చేసి పూలదండలు శాలువాలు తీసుకురావద్దని సూచించారు. అందరూ తప్పనిసరిగా ఈ విధానం పాటించి సహకరించాలన్నారు. పనుల నేపథ్యంలో పుట్టినరోజు నాడు పత్తికొండకు రావడంలేదని కార్యకర్తలు నాయకులు గుర్తించి తమ తమ గ్రామాల్లోనే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరారు. కగా నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీ పత్తికొండలో అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు. జనవరి ఒకటి కూడా కార్యకర్తలు గానీ నాయకులు గానీ అధికారులు కానీ పూలదండలు శాలువాలు తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇట్లు
తెలుగుదేశం పార్టీ.
మండల కమిటీ
తుగ్గలి
సెల్ 9494224783
సెల్ 9110775835