
శ్రీరామనవమి సందర్భంగా ఖోఖో పోటీలు ప్రారంభం
ఖోఖో పోటీలను నిర్వహించిన ఆర్మీ జవానులు.
ఖోఖో పోటీలను ప్రారంభించిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర.
తుగ్గలి న్యూస్ వెలుగు; శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఆర్మీ జవానులు నిర్వహించిన ఖోఖో పోటీలను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర శనివారం రోజున ప్రారంభించారు.ఈ పోటీల ప్రారంభోత్సవంలో భాగంగా తుగ్గలి జడ్పీ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చందు నాయక్ క్రీడాకారుల కోసం అందజేసిన క్రీడా దుస్తులను క్రీడాకారులకు తుగ్గలి నాగేంద్ర అందజేశారు. అనంతరం క్రీడాకారులు గెలుపోవటములను సమానంగా తీసుకోవాలని, ఈ పోటీలు కేవలం మానసిక ఉల్లాసం కోసమేనని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాబురావు, ఉపాధ్యాయులు,తుగ్గలి నాగేంద్ర తనయుడు వంశీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu